చంద్రబాబు టూర్లో స్వల్ప మార్పులు

విశాఖముచ్చట్లు :

ఇవాళ చంద్రబాబు టూర్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత విశాఖ వెళ్లి… అక్కడినుంచి ఢిల్లీ వెళ్లే విధంగా షెడ్యూల్‌ ఉంది. అయితే… పోలవరంపై పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… కాంట్రాక్టర్‌ను మారుస్తామని హెచ్చరించారు. ఇదే నేపథ్యంలో కాంట్రాక్టర్‌ను మారిస్తే ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతుందని… కాంట్రాక్టర్‌ మార్చమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు… నితిన్‌గడ్కరీని కలవాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలో మధ్యాహ్నం విశాఖ వెళ్లనున్న చంద్రబాబు… అనంతరం నాగ్‌పూర్‌ వెళ్లి గడ్కరీని కలవనున్నారు. పోలవరం పనులు ఆలస్యంపై చర్చించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి…విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *