చంద్రబాబు వెంట బీసీలు నడవాలి – లక్కుంట నాగరాజ

పుంగనూరు ముచ్చట్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా బీసీలు ఆయన వెంటే ఉండాలని పుంగనూరు మండల దేశం పార్టీ అధ్యక్షుడు లక్కుంట నాగరాజ , ఎంపీటీసీల సంఘ నాయకుడు కేశవరెడ్డి, వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని మేలుందొడ్డి, గోపిశెట్టిపల్లె, కొత్తూరు గ్రామాలలో నిర్వహించారు. బీసీ మహిళలు లక్షమందికి చంద్రన్న కానుకగా ఆర్థిక సహాయం అందించేందుకు రూ.300 కోట్లు ప్రభుత్వం కేటాయించడం హర్షనీయమన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలను చంద్రబాబునాయుడు అమలు పరుస్తున్నారని కొనియాడారు. రాబోవు ఎన్నికలలో తెలుగుదేశంకే అధికారం కట్టబెడతారని ఆశాబావం వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *