చెన్నైలో వర్ష బీభత్సం

చెన్నై ముచ్చట్లు

చెన్నైలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఐదు రోజులుగా నిరాటంకంగా పడుతున్న వర్షాల కారణంగా తమిళనాడులోని ఆరు జిల్లాల్లో 10 లక్షలకు పైగా ఇళ్లు నీట మునిగాయి.లక్షలాదిమంది నిర్వాసితులుగా మారిపోయారు.ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంవల్ల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.రాజధానినగరం చెన్నై, తిరువళ్లూర్‌, కాంచీపురం, కడలూరు, తిరువారూర్‌, నాగపట్టణం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో ప్రభావం ఎక్కువుగా ఉంది.శనివారం సైతం వర్షం పడడంతో నగరంతో పాటు శివారు ప్రాంతాలు మరింతగా నీట మునిగాయి.ముఖ్యంగా ముడిచ్చూరు, నన్మంగళం తదితర ప్రాంతాలు ఎటు చూసినా చెరువుల్లా కనిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.మొత్తం 31 మంది మంత్రులు సహాయ చర్యల్లోకి దిగారు.శిథిలాలను తొలగిస్తూ, అన్నార్తులను ఆదుకుంటూ, సహాయక శిబిరాలను పురమాయిస్తున్నారు.208 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా అవి బాధితులకు సరిపోవడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

శనివారం 40కి పైగా అంతర్జాతీయ, జాతీయ విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *