చెరుకు రైతులు బిందుసేధ్యం చేస్తే రూ.5 వేలు ఇస్తాం – కెబిడి షుగర్స్ వైస్ప్రెసిడెంట్ ఇంద్రప్రకాష్

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు కెబిడి చక్కెర ఫ్యాక్టరీ పరిధిలోని మూడు మండలాల చెరకు రైతులకు రూ.5 వేలు ఆర్థికసహాయం అందించనున్నట్లు కెబిడి షుగర్స్ వైస్‌ ప్రెసిడెంట్‌ డిజె. ఇంద్రప్రకాష్‌ తెలిపారు. పుంగనూరు, రామసముద్రం, పెద్దపంజాణి మండలాల్లో కరువు తీవ్రంగా ఉన్నందున రైతులు చెరకు పంటకు బిందుసేధ్యం పరికరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం 90 శాతం సబ్సిడి ఇస్తోందని, మిగిలిన 10 శాతంలో రూ.5 వేలు ఫ్యాక్టరీ ఇస్తుందన్నారు. మరో రూ.2500 లు కెన్‌ కార్పోరేషన్‌ ద్వారా రైతులకు రూ.7500 లు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈసారి లక్ష టన్నుల చెరకు క్రషింగ్‌ చేసేందుకు అగ్రీమెంట్లు చేసుకోవడం జరిగిందన్నారు. మరో 50 వేల టన్నులు తమిళనాడు , కర్నాటక నుంచి దిగుమతి చేస్తామన్నారు. ఫ్యాక్టరీ ఎలాంటి స్వలాభపేక్ష లేకుండ రైతుల కోసమే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడమే ఫ్యాక్టరీ ఆశయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఏజిఎం కె.దేవరాజన్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *