చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

మహబుబాబాద్‌ ముచ్చట్లు

చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన సంఘటన మహబుబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజు(12) , సాయికుమార్‌(7)లు శనివారం ఉదయం గ్రామానికి సమీపంలో గల చెరువులో ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా చెరువు వద్దకు చెరుకుని మృతదేహాలను చూసి కన్నీళ్ళు పుట్టుకున్నారు. కాగా మృతదేహాలపై పడి వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *