జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేద్దాం – ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు

వైఎస్సాఆర్సీపి అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైఎస్సాఆర్సీపి రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పుంగనూరులోని ఆర్యవైశ్య జిల్లా సంఘ అధ్యక్షుడు నరసింహులుశెట్టి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘ నాయకుడు యాదళం ప్రకాష్‌ వైఎస్సాఆర్సీపిలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. ఆయనకు పెద్దిరెడ్డి కండువ వేసి , పార్టీలోనికి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజస్వామిక పద్దతులతో సీఎం చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ఎద్దెవా చేశారు. ప్రతిపక్షనేత , ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మూడువేల కిలో మీటర్ల పాదయాత్ర ప్రారంభిస్తున్నారని తెలిపారు. అదే సమయంలో అసెంబ్లి సమావేశాలు ఏర్పాటు చేయడం ఆనైతికమన్నారు. ఎన్నికలు నెలల గడువులోనే జరుగుతుందని, చంద్రబాబునాయుడుకు తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రజలందరు సిద్దంకావాలని కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు చంద్రబాబు పాలనలో విసిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పిఎల్‌.శ్రీధర్‌, బాలాజి, బాలసుబ్రమణ్యం, వైఎస్సాఆర్సీపి నాయకులు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఆర్‌విటి.బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *