జగన్ పాదయాత్రకు మేము సైతం. – విద్యార్థి నాయకుడు క్రిష్ణ

పలమనేరు ముచ్చట్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు మేము సైతం సిద్ధంగా ఉన్నామని నియోజక వర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు క్రిష్ణప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక వైసీపీ కార్యాలయంలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆద్వర్యంలో నేడు విద్యార్థులతో కలసి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడ సాయంత్రం4:30 గం.లకు తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం చెప్పనున్నట్టు తెలిపారు. అదేవిధంగా శనివారం నాడు వైసీపీ అధినేత జగన్తో పాటుగా తిరుమలకు అలిపిరి శ్రీవారి పాదాల నుంచి కాలినడకన వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థి నాయకులు చందు, వినాయక, రంజిత్, శివ, మహేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *