జగన్ పాదయాత్రతో చంద్రబాబులో వణుకు మొదలైంది. – ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పలమనేరు ముచ్చట్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో వణుకు మొదలైందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గంగవరం మండల పరిధిలోని సాయినగర్ లో ఎస్టేట్ రమేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు నాలుగు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు అవినీతి కార్యక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆధారలతో నిరూపించేందుకు తాము సిద్దంగా వున్నామని, ప్రభుత్వం సిద్దమా అని ప్రశ్నించారు. వెన్నుపోటు, వలస రాజకీయాలకు చంద్రబాబు నాయుడు చిరునామా గా నిలిచారని ఎద్దేవా చేశారు.ఆచరణ సాధ్యం కాని 600 హామీలతో మోడీ, పవన్ కళ్యాణ్ లతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గద్దెనెక్కాడని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలను పదవుల ఆశతో ప్రలోభపెట్టి,పార్టీలో చేర్చుకోవడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. అలాగే రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి విషయంలో కూడా అదే జరిగిందన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైసీపీ గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మొగసాల క్రిష్ణమూర్తి,వాసు, సంయుక్త కార్యదర్శి వెంకటేగౌడ, నియోజకవర్గ కోఆర్డినేటర్లు రాకేష్ రెడ్డి, సివి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి, నాయకులు ఆకుల గజేంద్ర, కన్వినర్లు మండిసుధ, బాగారెడ్డి, జిల్లా మైనారిటీ కార్యదర్శి సుహేబ్, యరబల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *