జగన్ పాదయాత్రతో పార్టీ శేణుల్లో నూతనోత్సాహం.

పలమనేరు ముచ్చట్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారం దక్కించుకున్న తెదేపా ప్రభుత్వం నేడు ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. పేదలకు రేషన్ కార్డులు, పక్కాగృహాలు, నిరుద్యోగ భృతి, రైతు,డ్వాక్రా ఋణ మాఫీ వంటి హామీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా పూర్తి స్థాయిలో జరగకపోవడం తెదేపా పార్టీ వైఫల్యాలు గా వినిపిస్తోంది. మహిళలకు రక్షణ కల్పించకపోవడం, అధికారులపై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేయడం వంటి విషయాలలో ప్రభుత్వం నియంత్రుత్వ ధోరణిని ప్రదర్శించడంతో టీడీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందనే చెప్పాలి. పైపెచ్చు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా తమపార్టీకి ఓట్లు వేయకపోతే ప్రజలు తాము వేసిన రోడ్లపై తిరగకూడదు, రేషన్, పెన్షన్లు తీసుకోకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాకెక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం పై అప్పట్లో పలు పార్టీలు సీఎం తన సొంత నిధులేమైనా ప్రజలకు ఖర్చు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదతమే. మొదటి నుంచీ తెదేపా పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తోందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి తమ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *