జగన్ ముఖ్యమంత్రి కావాలని హిందూ ముస్లిం ప్రార్థనలు.

పెద్దపంజాణి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జనసంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి ఆరోగ్యంగా ఉండాలని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని హిందూ ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. మండలంలోని రాయలపేట గ్రామంలో వైసీపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి సుహేబ్ ఆద్వర్యంలో స్థానిక సైదానీమ దర్గా, మారెమ్మ ఆలయం, చర్చిల్లో ప్రత్యేకంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శి గుండ్లపల్లి రవి, బూత్ కమిటీ కన్వినర్లు దామోదర్, సాయిసుదర్శన్ రెడ్డి, ఇమామ్ వలి, కార్యకర్తలు వినాయకరెడ్డి, నూర్,చాన్, జవహర్, ముభారక్, ముజీబ్, నూర్ మహమ్మద్,జాఫర్,మస్తాన్ ఫారుక్, నడిపన్న,క్రిష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *