జనమే శ్వాసగా..!

×జిల్లా రాజకీయాల్లో విలక్షణ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ×నియోజకవర్గంలో ఏటా రెండుసార్లు పల్లెబాటతో ఇంటింటికి ×నిత్యం ప్రజల్లోనే ఉంటూ..సమస్యలు పరిష్కరిస్తూ.. ×భాస్కర్‌రెడ్డి ట్రస్టు, సొంత నిధులతో అభివృద్ది కార్యక్రమాలు

పుంగనూరు ముచ్చట్లు

జిల్లా రాజకీయ చిత్రపటంలో గడచిన నలబై సంవత్సరాలలో పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలక్షణ నేత. ఏ నేతకు లేని గుర్తింపు దక్కించుకొన్న ఆయనకు జనమే శ్వాస. ఇన్‌స్టంట్‌ రాజకీయాలు సాగుతున్న ఈ రోజుల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలు ఆలకిస్తూ..పరిష్కరిస్తూ కనిపిస్తారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలే జీవితంగా మార్చుకొని ప్రజానేతగా గుర్తింపు దక్కించుకోవడం వెనుక ఆయన కఠోర శ్రమ, కృషి ఉంది. అదే అయన్ను జిల్లాలో తిరుగులేని నేతగా చేసింది.

×ఏటా జనం మధ్యేనే…..

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిత్యం జనంలో ఉంటూ వారి సమస్యలు వింటూ, పరిష్కరిస్తూ వెళ్లడమే దినచర్య. వేకువజాము నుంచి ఎంతరాత్రైనా జనం కోసమే ఉంటారు. పార్టీపరంగానైనా, ప్రభుత్వ కార్యక్రమాలతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పుంగనూరు నియోజకవర్గంలో మున్సిపాలిటితో పాటు ఆరు మండలాలు ఉన్నాయి. అవి పుంగనూరు మున్సిపాలిటిలో 24 వార్డులు ఉన్నాయి. అలాగే పుంగనూరు , చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు కలవు . వీటిలో 106 పంచాయతీలు, 876 గ్రామాలు ఉన్నాయి. ఏడాది రెండుసార్లు పల్లెబాట పేరుతో ప్రతిపల్లెకు వెళ్లి జనంతో మమేకమవుతారు. ఒక్కో పల్లెను రెండుసార్లు ఈ కార్యక్రమం ద్వారా సందర్శిస్తే..అధికారిక, పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆహ్వనం మేరకు సాగించే పర్యటనలతో ఏడాదంతా ప్రజలతో నడిపేస్తారు. ఈ పర్యటనల్లో పెద్దిరెడ్డి అందరిలో సామాన్యడిలా కలిసిపోతారు. ఎవరు ఏమి చెప్పినా ఆలకించడం ద్వారా ప్రజలు తమ సమస్యలు చెప్పుకొంటారు. వ్యక్తి, సామూహిక సమస్యలను వీలైతే ప్రభుత్వ నిధులతో పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే పరిష్కరించిన సమస్యలను అత్యధికంగా భాస్కర్‌రెడ్డి ట్రస్టు ద్వారా సొంత నిధులతో పరిష్కరించినవే .

×అయ్యప్పంటే ఎనలేని భక్తి…

ఏడాదంతా ప్రజల్లో ఏలా కలిసివుంటారో భక్తి విషయంలోనూ అంతే. అయ్యప్పస్వామి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అచంచలమైన భక్తి విశ్వాసాలు. తన స్వగ్రామమైన సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసి, అత్యంత సుందరంగా శ్రీ అయ్యప్పస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో నిత్య పూజలు, అన్నదానాలు కొనసాగిస్తున్నారు. ప్రతి యేటా రెండుసార్లు అయ్యప్పమాల ధరిస్తారు. కఠోరదీక్షతో మాలధారణ ఉంటూ అదే సమయంలో పల్లెబాట నిర్వహిస్తారు. కాలికి చెప్పులు లేకుండా పల్లెల్లో కిలోమీటర్ల దూరం నడుస్తారు.

×పెద్దిరెడ్డి అభివృద్ది ఇంతింతకాదు..

పుంగనూరు మున్సిపాలిటి పక్కాభవనాలు, పట్టణ మంచినీటి సమస్య తీర్చేందుకు పుంగమ్మ చెరువులో సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించి, సదుం మండలం గార్గెయ నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేశారు. 74 కిలో మీటర్ల పైపులైన్లతో పుంగనూరు నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు చేపట్టిన కార్యక్రమాలతో పెద్దిరెడ్డిని అపరభగీరథుడని ప్రజలు కొనియాడుతారు. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసి డిపో నిర్మాణం, ట్రాఫిక్‌ సమస్య తీర్చేందుకు పుంగనూరు పట్టణానికి బైపాస్‌రోడ్డు మంజూరు చేయించారు. అభివృద్ధి కార్యక్రమాలలో పెద్దిరెడ్డి తన సొంత నిధులు ప్రజల కోసం ఖర్చు చేయడం విశేషం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *