జమ్ముకశ్మీర్‌-పీఓకే మధ్య మళ్లీ బస్సు!

శ్రీనగర్ ముచ్చట్లు:

జమ్ముకశ్మీర్‌-పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) ప్రాంతానికి నడిచే బస్సును సోమవారం నుంచి పునరుద్ధరించనున్నారు. పూంచ్‌-రావల్‌కోట్‌ రోడ్డు మార్గంలో సరిహద్దు రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఈ బస్సు ప్రయాణిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ బస్సు సర్వీసును గత నాలుగు నెలలుగా నిలిపివేశారు. సరిహద్దు వెంబడి పాకిస్తాన్‌ వైపు నుంచి పదే పదే కాల్పులు, మోర్టార్ల ప్రయోగం కారణంగా జూలై 10న ఈ బస్సును నిలిపివేశారు.అప్పటినుంచి చకన్‌-దా-బాగ్‌ వైపు నుంచి సరిహద్దు రేఖ దాటి బస్సు నడవలేదు. అయితే సరిహద్దు రేఖ వద్ద శుక్రవారం జరిగిన సమావేశంలో బస్సు ప్రయాణం, వ్యాపారాలను కొనసాగించాలని రెండు దేశాల సీనియర్‌ అధికారులు నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *