జర్నలిస్టుల సంక్షేమం కోసం ఢిల్లీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన కేజ్రీవాల్ సర్కార్‌

ఢిల్లీ ముచ్చట్లు

జర్నలిస్టుల సంక్షేమం కోసం ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ సర్కారు బిల్లు ప్రవేశపెట్టింది. మాజీత్యా కమిటీ సిఫార్సులను కచ్చితంగా అమలు చేసేలా నిబంధనలు రూపొందించాలని బిల్లులో ప్రభుత్వం తెలిపింది. చాలా మీడియా సంస్థల మేనేజ్‌మెంట్లు ఈ సిఫార్సులను అమలు చేయకపోవడంతో చట్ట రూపం తీసుకురావాల్సి వచ్చిందని ఢిల్లీ సర్కారు తెలిపింది. జర్నలిస్టులకు కనీస వేతనం రూ.25000, నాన్-జర్నలిస్టులకు కనీస వేతనం రూ.17,500గా ఉండాలని బిల్లులో పేర్కొంది. సంస్థల ఆదాయాన్ని బట్టి 8 విభాగాలుగా మీడియా సంస్థల వర్గీకరణ, న్యూస్ ఏజెన్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. జర్నలిస్టుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలుగా నిర్ణయించారు. పితృత్వ సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలని బిల్లులో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *