జాతీయం ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌ ముచ్చట్లు:

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు మరోసారి మావోయిస్టులపై పై చేయి సాధించాయి. నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లను మట్టుపెట్టాయి. సోమవారం సాయంత్రం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది.సుక్మా జిల్లా వద్ద అబుజ్‌మార్గ్‌ ప్రహార్‌ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఒక్కసారిగా దాడులు నిర్వహించాయి. ప్రహార్‌ 2 పేరిట నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. 9 ఆయుధాలను స్వాధీనపరుచుకున్నామని, సుక్మా దగ్గర క్యాంపులను ధ్వంసం చేశామని భద్రతా దళాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *