జాతీయ వినియోగ దారుల దినోత్సవం

ప్రతి సంవత్సరం డిసెంబర్ 24 తేదీన జాతీయ వినియోగ దారుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కొన్ని అనివార్య కారణాల వలన ఆకార్యక్రమం 27 తేదిన జరుపుకొవడం జరిగినది,ఈ కార్యక్రమము అనంతపూర్ జిల్లా పాలనాధికారి వీర పాండియన్ జిల్లా వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ఆవరణంలోని రెవిన్యూ భవనంలో ఘనంగా జరిగినది,ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ మరియు వాస్యరచన పోటీలలో విజేతల లైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది మరియు నిత్య జీవితం లో వినియోగ దారులు ఎదుర్కుంటున్న సమస్యలు ఆహార కల్తీ తూనికలు,కొలతల్లో మోసాలు వస్తువులలో నాణ్యత లోపాలు వీటిని ఎదురుకోవడంలో వినియోగదారులకు ఉన్న హక్కులు బాధ్యతలు ప్రభుత్వ శాఖలు మరియు వినియోగదారుల బృందాలు ఏవిధంగా పనిచేయాలనే విషయాలపై విపులంగా వివిధ వ్యక్తులు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో వివిద శాఖల అధికారులు వినియోగదారుల బృంద సభ్యులు జిల్లా నలుమూలాననుంచి విచ్చేసిన ప్రజలు పాల్గొనడం జరిగినది .ఈ కార్యక్రమంలో వినియోగదారుల బృంద ప్రతినిధులు కృష్ణ మూర్తి ,శ్రీనివాసులు,పుట్టపర్తి సురేష్,మహబూబ్ బాషా మరియు ఇతర ప్రతినిథులు పాలుగొని ఈ కార్యక్రమం నిర్వహించడంలో జిల్లా సరఫరా అధికారి శివ రామయ్యా గారి కృషిని అందరూ అభినందించారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *