జీఎస్టీ తగ్గింపు దివాళీ గిఫ్ట్‌ కాదు: శివసేన

ముంబై ముచ్చట్లు
జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ మండలి చేసిన మార్పులను దివాళీ గిఫ్ట్‌గా స్వీకరించడం లేదని శివ సేన పేర్కొన్నది. కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్ను విధానంలో ఇంకా అనేక మార్పులు రావాలని శివసేన ప్రెసిడెంట్‌ ఉద్దవ్‌ థాకరే అభిప్రాయపడ్డారు. ఇవాళ ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వ పాలన పట్ల దేశ ప్రజలు సంతోషంగా లేరన్నారు. పెట్రోల్‌ ధరలు ఇంకా తగ్గలేదని, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందన్నారు. జీఎస్టీ శ్లాబుల్లో చేసిన మార్పులను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఇప్పటి వరకు జీఎస్టీ కింద వసూల్‌ చేసిన డబ్బును వాపసు ఇస్తారా అని ఉద్దవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *