Minister Amarnath Reddy on JEE Plus - 3, BCC second installment housing scheme

జీ ప్లస్ – 3, బీఎల్సీ రెండో విడత గృహనిర్మాణ పథకంపై మంత్రి అమరనాథ్ రెడ్డి సమీక్ష

Date:24/01/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో రెండో విడత గృహనిర్మాణ పథకంలో భాగంగా చేపట్టనున్న జీ ప్లస్ – 3, బీఎల్సీ గృహ నిర్మాణాలపై రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి మునిసిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు బుధవారం స్థానిక తెదేపా కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంటావూరు, గడ్డూరు గ్రామాల సమీపంలో ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించి వెంటనే సంబంధిత నివేదికను తనకు అందించాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో మునిసిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అలాగే ఆర్ఐ రమేష్ బాబు, వీఆర్వో ప్రకాష్ లు స్పందిస్తూ రెండు రోజుల్లో నివేదికలు తయారు చేసి సంబంధిత ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు రామచంద్ర రావు, ఏఈ, డీఈ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి అమరనాథ్ రెడ్డి తన స్వగ్రామమైన కెళవాతిలో పెద్దపంజాణి మండల తెదేపా నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా జిల్లా కోశాధికారి ఆర్వీబాలాజి, పెద్దపంజాణి ఎంపీపీ మురళీకృష్ణ, జెడ్పీటీసి సులోచన, మండల తెదేపా అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మురహరి రెడ్డి, తెదేపా జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి భానుప్రతాప్ రెడ్డి, బట్టందొడ్డి సుధాకర్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags : Minister Amarnath Reddy on JEE Plus – 3, BCC second installment housing scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *