జెఏసి సమావేశాన్ని జెండా ఎగురవేసి ప్రారంభిస్తున్న అశోక్‌బాబు

తిరుపతి ముచ్చట్లు

తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరిగే  రాష్ట్రస్థాయి 20వ ఎన్‌జీవో మహాసభలను రాష్ట్ర జెఏసీ చైర్మన్‌ అశోక్‌బాబు జెండా ఎగురవేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  చిన్నరాజప్ప, ఆర్థికశాఖ మంత్రి యనమలరామక్రిష్ణుడుతో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌, రెండు జిల్లాల ఎన్‌జీవోలు హాజరైయ్యారు. ఈసందర్భంగా పలు సమస్యలపై జెఏసి సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో అశోక్‌బాబు మాట్లాడుతూ 11వ పీఆర్సీ కమిటి నియమించాలని, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు విడుదల చేయాలని, 12 నెలల పీఆర్సీ బకాయిలు రూ. 5 వేల కోట్లు విడుదల చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెఏసీ చైర్మన్‌ క్రిష్ణంనాయుడు, పుంగనూరు నియోజకవర్గ జెఏసి చైర్మన్‌ వరదారెడ్డితో పాటు 13 జిల్లాల ప్రతినిధులు హాజరైయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *