టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ సబ్జెక్ట్‌ల వారిగా పోస్టులు

ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో భాగంగా 8,792 పోస్టులకు టీఆర్టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఐదు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలచేసింది. తొలిసారిగా 31 జిల్లాలవారీగా కొలువులు భర్తీ కానున్నాయి. ఈ నెల 30 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. ఫిబ్రవరి రెండోవారంలో పరీక్ష నిర్వహించనున్నారు. స్కూల్అసిస్టెంట్ (ఎస్‌ఏ), లాంగ్వేజ్ పండిట్లు, సెకండరీగ్రేడ్ టీచర్(ఎస్జీటీ) భర్తీలో 80% వెయిటేజీ రాతపరీక్షకు ఉండగా, టెట్‌లో సాధించిన మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)కు టెట్ వెయిటేజీ ఉండదు. కేవలం రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ఒకే అభ్యర్థి ఒకటికంటే ఎక్కువ పోస్టులకు అర్హులైతే, వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టీఆర్టీకి సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా.
TSPSC , TEACHERS RECRUITMENT TEST , SUBJECT WISE POSTS ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *