టీటీడీలో నాయిబ్రహ్మణుల నిరసన

తిరుమల ముచ్చట్లు

తిరుపతి దేవస్థానం కల్యాణకట్టలో పని చేస్తున్న నాయిబ్రహ్మణులు శనివారం నిరసనకు దిగారు. విధుల్లో నుంచి తొలగించిన 243 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కల్యాణకట్టలో అవినీతి ఎక్కువైపోయిందని భక్తులు.. టీటీడీకి ఫిర్యాదు చేశారు. తలనీలాలు సమర్పించేందుకు ఎలాంటి రుసుము వసూలు చేయదు టీటీడీ. అయితే తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి నాయిబ్రహ్మణులు టిప్(రూ. 10 నుంచి రూ. 50) వసూలు చేస్తున్నారని కొంతమంది భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన టీటీడీ.. 243 మంది నాయిబ్రహ్మణులను విధుల నుంచి తొలగించింది. దీంతో వారంతా టీటీడీ పాలకమండలి భవనం ఎదుట శనివారం నిరసనకు దిగారు.మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల్లో నుంచి తీసేయడంతో.. తమకుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. మానవతాదృక్పథంతో తమను విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని కోరారు.టీడీ ట్రస్ట్ ద్వారా 943 మంది నాయిబ్రహ్మణులను రిక్రూట్ చేసుకున్నారు. వీరిలో చాలా మంది కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *