టీడీపీకి గుడ్‌బై చెప్పిన రేవంత్

అమరావతి ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీకి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. పార్టీకి, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన సమావేశంలో రేవంత్ కు మాట్లాడేందుకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది. వ్యక్తిగతంగా చంద్రబాబును కలిసేందుకు రేవంత్ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో అంతిమంగా పార్టీకి రాజీనామా చేసేందుకు రేవంత్ నిర్ణయించుకున్నారు. అయితే రాజీనామా లేఖను ఏపీ సీఎం పేషీలో ఇచ్చి వెళ్లారు రేవంత్. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.చంద్రబాబుపై నాకెంతో గౌరవం పార్టీపై, అధ్యక్షుడిపై తనకెంతో గౌరవం ఉందని రేవంత్ స్పష్టం చేశారు. కొంతకాలంగా పార్టీలో జరిగే పరిణామాలు తనను ఎంతో బాధించాయని తెలిపారు. పార్టీలో తన ఎదుగుదలకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బాబు తనకు తండ్రితో సమానమన్నారు.ఎల్లప్పుడూ పార్టీ, కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని అని చెప్పారు. రేవంత్ రాజీనామాపై చంద్రబాబు ఏమన్నారంటే.. అమరావతి : కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. రేవంత్ రాజీనామా లేఖ తనకు అందలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయన్నారు.అవసరాలను బట్టి కొందరు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పార్టీలోకి వస్తుంటారు.. వెళ్తుంటారు అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కలిసేందుకు రేవంత్ ప్రయత్నం అమరావతిలో ఇవాళ చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు.ఆ సమయంలో చంద్రబాబు ప్రెస్ మీట్ లో ఉన్నారు. దీంతో తన రాజీనామా లేఖను సీఎం పేషీలో ఇచ్చి వెళ్లారు రేవంత్. అయితే ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడతాను అని రేవంత్ కు చెప్పాను ఏపీ సీఎం మీడియాతో అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *