టీ బీజేపీ నేతలకు కొత్త తలనొప్పి

తెలంగాణ ముచ్చట్లు

తెలంగాణ బీజేపీ నేతలకి కొత్త సమస్య వచ్చిపడింది.కేంద్ర పెద్దలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న దీపావళి కానుకల పట్ల రాష్ట బీజేపీ ఆగ్రహంగా ఉంది. కానుకల విషయంలో తాము విమర్శలు గుప్పిస్తుంటే..వాటిని కేంద్ర మంత్రులు స్వీకరించడం తమకు ఇబ్బంది కరంగా మారిందని నేతలు వాపోతున్నారు. అందుకే కానుకలు స్వీకరించోద్దని కేంద్ర పెద్దలకు విజ్నప్తులు చేస్తున్నారు రాష్ట్ర కమలనేతలు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మంత్రులకు కానుకలు ఇస్తోంది. 40 వేల విలువగల చీరలు, షెర్వాణీలను కేంద్ర మంత్రులకు గిఫ్ట్ చేస్తోంది. అయితే ఇది రాష్ట బీజేపీకి తలనొప్పిగా మారింది. కానుకలు తీసుకుంటే రాష్ట్రంలో బీజేపీ కి నష్టం జరుగుతుందని టి బీజేపీ వా పోతుంది..ఇప్పటికే కేంద్ర మంత్రులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాని పొగడ్తలతో ముచ్చెత్తడం వల్ల పార్టీ కి నష్టం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు కేంద్ర మంత్రులు కానుకలు తీసుకుంటే అసలుకే ఎసరు వస్తుందని నాయకులు మదనపడుతున్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యత కోసం కానుకలను కేంద్ర మంత్రులకు అందచేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ సంస్క్రుతిని, హస్తకలలను చాటి చెప్పేందుకు బహుమతులను పంపిణిచేస్తోంది. దాంతో పాటు కేంద్రాన్ని మచ్చిక చేసుకోవడం ద్వారా ఎక్కువ నిధులు రాబట్టుకునే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తుంది..అయితే ఈ వ్యవహారాన్ని రాష్ట బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది.రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా మహిళలకు నాశిరకం చీరలను పంపిణీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు,నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. బీజేపీ సైతం చీరల పంపిణిని తప్పుబట్టింది. ఇప్పుడు కేంద్ర మంత్రులకు కానుకలుగా చీరలు,షేర్వాణిలు వేల వేల ఖరీదు చేసే కానుకలు కేంద్ర పెద్దలకు పంపిణి చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వేళాతాయని కమలం నేతలు కలవర పడుతున్నారు. ఇరు పార్టీలు పరస్పరం అవగాహనతో పనిచేస్తున్నాయనే భావన ప్రజల్లో బలంగా నాటుకుంటుందని బయపడుతున్నారు.కాంగ్రెస్ ఇప్పటికే కేంద్రానికి కానుకల మేర లంచాలు అందచేస్తున్నారని ఆరోపిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కానుకలను కేంద్ర మంత్రులు తిరస్కరించాలని కోరుతున్నారు రాష్ట బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కానుకల పంపిణి ప్రజా ధన దుర్వినియోగం కిందకే వస్తుందని నేతలు గుర్తు చేస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కానుకలను కేంద్రం తీసుకోరాదని కమల నాథులు విజ్నప్తి చేస్తున్నారు.మరి కేంద్ర ,రాష్ట్రా ప్రభుత్వల సత్సంబంధాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కానుకలను కేంద్రం తీసుకుంటుందా?లేదా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కానుకలను ఇప్పటికైనా తిరస్కరిస్తుందా? అన్నదే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *