డీఎస్పీ హరినాథ్‌రెడ్డి నివాసాలపై ఏసీబీ దాడులు

కర్నూలు ముచ్చట్లు:

సీఐడీ డీఎస్పీ హరనాథ్‌రెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు జరిపింది. శనివారం తెల్లవారుజాము నుంచి కర్నూలు, కడప, అనంతపురం, బెంగళూరులోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు మొత్తం తొమ్మిది బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు.గతంలో నంద్యాల డీఎస్పీగా పనిచేసిన హరినాథ్‌రెడ్డి.. ప్రస్తుతం విజయవాడ సీఐడీ డీఎస్పీగా కొనసాగుతున్నారు. ఆయన పెద్దమొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సోదాల్లో ఇప్పటివరకు రూ. 7 లక్షల నగదు, డాక్యుమెంట్లు, కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *