డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటిషన్…

తెలంగాణ ప్రభుత్వం తాజాగా టీఆర్టీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే… దీనిపై ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… కొత్త జిల్లాల వారీగా కాకుండా… పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని పిటిషనర్ కోర్టుకు వెళ్లాడు… ఈ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. కాగా, ప్రభుత్వం వారం రోజులు గడువు కోరింది… అడిషనల్ అడ్వికేట్ జనరల్ సలహా తీసుకుని అభిప్రాయం చెబుతామని కోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం… నాలుగు రోజుల్లో అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో… న్యాయపరంగా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని డీఎస్సీ వేశామంటోంది ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *