తమ్ముళ్లకు కాంగ్రెస్ స్నేహ ‘హస్తం’: రేవంత్ రెడ్డి బాటలోనే ప్రముఖ నేతలు?

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లోగా టీటీడీపీని ఖాళీ చేయించడానికి భారీ స్కెచ్‌ వేసినట్లు కనిపిస్తోంది. టీటీడీపీ మాజీ నేత రేవంత్‌ రెడ్డి సైకిల్‌ దిగి, హస్తానికి చేయూత ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోంది. తెలంగాణ టీడీపీ ఓటు బ్యాంక్‌పై కన్నేసిన హస్తం పార్టీ, రేవంత్‌ రెడ్డి ద్వారా పలువురు నేతలను పార్టీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. టీటీడీపీ ముఖ్య నేతలను కాంగ్రెస్‌లోకి వచ్చేలా మంతనాలు సాగిస్తోంది. ఇందుకు జిల్లాల వారీగా టీడీపీ నేతలతో చర్చలు జరుపుతోంది. వీలైనంత ఎక్కువమంది టీడీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహరచనగా కనిపిస్తోంది.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న టీ టీడీపీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు.మరో రెండు రోజుల్లో భారీగా వలసలు ఉంటాయన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నిన్న రేవంత్‌, ఇవాళ వేం నరేందర్‌ రెడ్డి రాజీనామాలు చేయగా, తాజాగా పటేల్‌ రమేష్‌ రెడ్డి, బెల్లయ్య నాయక్‌, రాజారాం యాదవ్‌ కూడా రాజీనామాలు చేశారు. అదే బాటలో మరికొందరు టీడీపీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 31న రేవంత్‌తో పాటుగా మరో 30మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం సాగింది. ఇప్పటికే రాష్ట్రంలో గెలిచిన టీడీపీ ముఖ్యనేతలందరూ అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి మరికొందరు నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్తే టీటీడీపీకి నష్టమే. ఇప్పటివరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంచర్ల భూపాల్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌రెడ్డి, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ముఖ్య టీడీపీ నేతలుగా ఉన్నారు. వీరిలో నర్సింహులు మినహా మిగతావారు రేవంత్‌ వెంట వెళతారని సమాచారం. నల్గొండ నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు పటేల్‌ రమేష్‌రెడ్డి వెళ్లడం లాంఛనమే. వీరిద్దరూ రేవంత్‌తోపాటే హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. టీటీడీపీని నడిపించిన సమయంలో చాలామంది నాయకులు రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా మారారు. రేవంత్‌ అభీష్టం మేరకు కంచర్ల భూపాల్‌రెడ్డి ఆయన వెంట వెళ్లటానికి సుముఖంగా ఉన్నారని సమాచారం. పటేల్‌ రమేష్‌రెడ్డి, రేవంత్‌ అబిడ్స్‌లోని రెడ్డిహాస్టల్‌లో కలిసి చదువుకున్నారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రమేష్‌రెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. దీంతో ఆయన వెళ్లడం ఖాయమేనని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని కంచర్ల భూపాల్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి పేర్కొన్నారు.కార్యకర్తలు వ్యతిరేకిస్తుండటంతో ఉమామాధవరెడ్డి వెళ్లాలా? పార్టీలోనే ఉండాలా? అన్న మీమాంసలో కొనసాగుతున్నారు. తెలంగాణ గడ్డపై తొలి నుంచి ముఖ్య నాయకుడిగా వెలుగొందిన మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మరణం తర్వాత ఆమె పార్టీలో కీలకంగా పనిచేశారు. ఇటీవల వారి తనయుడు సందీప్‌రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కూడా. ఆ మేరకు ఆయన్ను యాదాద్రి భువనగిరి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతానికి పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, భవిష్యత్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దామని ఉమా మాధవరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.‘రేవంత్ రెడ్డి’ నిష్క్రమణ ఉదంతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ప్రకంపనలు స్రుష్టిస్తుందని భావిస్తున్నారు. టీడీపీ సీనియర్‌ నేత, మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి కూడా రేవంత్‌రెడ్డి బాటలోనే నడిచారు. తాను టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. నరేందర్‌ రెడ్డితో పాటు ఇంకెవరు రేవంత్‌ను అనుసరించబోతున్నారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొన్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, సీతక్క, గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం భవితవ్యంపై ఊహాగానాలు తలెత్తుతున్నాయి. వారు మాత్రం పార్టీని వీడేది లేదని బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ నాయకుడిగా రేవంత్‌ రెడ్డితో కలిసి పాలక పార్టీ విధానాలపై పోరాడామే తప్ప ఆయనను గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం తమకు లేనే లేదని పలువురు నేతలు అంటున్నారు. ఇంతకు ముందు ఎర్రబెల్లి దయాకర్‌ రావు గులాబీ తీర్థం పుచ్చుకున్నప్పుడు కూడా జిల్లాలో ఇలాంటి ప్రచారమే జరిగిందని గుర్తు చేస్తున్నారు.నర్సంపేట విషయానికొస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *