తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య ఉరేసుకుని తనువు చాలించిన కూతురు.. అదృశ్యమైన ఆరు రోజులకు మృతదేహం గుర్తింపు

గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా):

కళాశాలకు సరిగ్గా వెళ్లడం లేదు అని తల్లి మందలించిందని మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకుని తనువు చాలించింది. గంభీరావుపే ట మండలం సముద్ర లింగాపూర్‌ గ్రామ పంచాయితీ పరిధిలోని లక్ష్మిపూర్‌ తండాకు చెందిన బాదవత్‌ మౌనిక (17) అనే ఇంటర్‌ విద్యార్థిని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గత బుధవా రం ఇంటి నుంచి వెళ్లిన మౌనిక మృతదేహాన్ని గ్రామస్థులు సోమవారం గ్రామ శివారులో గుర్తించారు.గ్రామస్థు లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బదావత్‌ బూలీకి ఇద్దరు కూతుళ్లతో పాటు ఒక కొడుకు ఉ న్నారు. భర్త ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లి 12 ఏళ్ల క్రితం అక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి కూలి పని చేస్తూ తల్లే పిల్లలను చదివిస్తూ వస్తోంది.పెద్ద కూతురికి వివాహం అయింది. మౌనిక ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి రాచర్ల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. మౌనిక సరిగ్గా కళాశాలకు వె ళ్లకపోవడంతో మౌనికను బుధవారం తల్లి బూలీ మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన మౌనిక అదే రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో కన్పించకుండా ఎటో వెళ్లిపోయింది.విషయం తెలిసి కుటుంబ సభ్యులు తెల్లవారే వరకు గాలించినా ఆచూకి లభించలేదు. బంధువుల ఊళ్లకు వెళ్లి గాలించినా మౌనిక జాడ తెలియలేదు. ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు సోమవారం సాయంత్రం లక్ష్మిపూర్‌ గ్రామ శివారులో చెట్టుకు మౌనిక మృతదేహం ఉండటాన్ని గుర్తించిన మేకల కాపరి గమనించి వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించాడు.విషయం తెలుసుకున్న తల్లి బూలీ, బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలివెళ్లారు. ‘నీ భవిష్యత్‌ కోసమే మందలించా బిడ్డా నువ్వు ఇట్లా చేసుకుంటావని అనుకోలేదు’ అని తల్లి రోదించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. సంఘటన స్థలానికి ఎస్‌ఐ లింగమూర్తి వెళ్లి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *