తాలిబన్‌ ఆత్మాహుతి దాడి33మంది మృతి.. 200 మందికిపైగా గాయాలు

 ఖోస్ట్‌ ముచ్చట్లు

అఫ్గానిస్థాన్‌లో పక్తియా ప్రావిన్స్‌లో పోలీస్‌ శిక్షణ కేంద్రంపై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. తాలిబన్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు 33 మంది మృతిచెందగా.. మరో 200 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.పక్తియా ప్రావిన్స్‌ రాజధాని గార్డెజ్‌లో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పోలీస్‌ హెడ్‌క్వార్డర్స్‌కు సమీపంలో ఉన్న పోలీస్‌ శిక్షణ కేంద్రంపై ముష్కరులు విరుచుకుపడ్డారు.భద్రతా వలయంలోకి చొచ్చుకొచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు ముష్కరులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 33 మంది మృతిచెందారు.మృతుల్లో పోలీసులతో పాటు మహిళలు, విద్యార్థులు కూడా ఉన్నారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రక్కు, జీపుతో ఆత్మాహుతికి పాల్పడినట్లు భద్రతాసిబ్బంది వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. కాగా.. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఘటనకు పాల్పడింది తామేనంటూ తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *