తిరగబడిన లారీ… పదిమంది దుర్మరణం

న్యూఢిల్లీ ముచ్చట్లు:

టైల్స్ లోడుతో వెళుతున్న ఓ ట్రక్కు తిరగబడడంతో ముగ్గురు మహిళలు సహా పదిమంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారు జామున మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన లారీ కర్నాటక నుంచి మహారాష్ట్రకు టైల్స్ తీసుకెళుతున్నట్టు గుర్తించారు. రాత్రి 2గంటల ప్రాంతంలో టాస్గాన్- కవాతే మహకల్ జాతీయ రహదారి సమీపంలో ట్రక్కు తిరగబడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *