తిరుమలకు చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు

తిరుమల ముచ్చట్లు

శ్రీలంక్ష అధ్యక్షుడు శ్రీమైత్రిపాల సిరిసేన శనివారం తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న సిరిసేనకు తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఆకే రవికృష్ణతో పాటు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో శ్రీవారిని శ్రీమైత్రిపాల సిరిసేన దర్శించుకోనున్నారు. సిరిసేన పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *