తిరుమలలో దొరికిన గంజాయి..

తిరుమల ముచ్చట్లు :

తిరుమలలో గంజాయి కలకలం సృష్టించింది. గంగాద్రి అనే కాంట్రాక్ట్ ఉద్యోగి నుండి 60 గ్రాముల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలో పనిచేసే గంగాద్రి అనే కాంట్రాక్ట్ ఉద్యోగి గంజాయిని తిరుమలకు తరలిస్తుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంగాద్రి గత కొంతకాలంగా తిరుమల పుణ్యక్షేత్రానికి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు డబ్బుకు ఆశపడి గుట్కా, మాంసం, పేలుడు పదార్థాలు, మద్యం వంటి నిషేధిత వస్తువులను తిరమలలో అక్రమ రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గంజాయిని తిరుమలకు తెచ్చి ఎవ్వరెవ్వరికి సరఫరా చేస్తున్నాడనే విషయంపై గంగాద్రిని విచారణ చేస్తున్నామని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐ మురళి మోహన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *