తిరుమలేశుని పుష్పయాగ మహోత్సవం

తిరుమల ముచ్చట్లు:

తిరుమలేశుని పుష్పయాగ మహోత్సవ అంకురారర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి సేనాధిపతి అయిన వశ్వక్సేనుడుతో కలిసి ఆలయ మాడవీధుల్లో వూరేగుతూ వసంత మండపానికి చేరుకున్నారు. వసంత మండపంలో సేకరించిన పుట్టమన్నుతో అర్చకులు ఆలయంలోని యాగశాలకు చేరుకుని వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 టన్నుల పూలతో పుష్పకైంకర్యాన్ని నిర్వహిస్తారు. పుష్పయాగం కారణంగా కల్యాణోత్సవం, వూంజల్‌సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం సేవలను తితిదే రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *