తెతెదేపా నేతలతో చంద్రబాబు భేటీ

అమరావతి ముచ్చట్లు:

తెలంగాణ తెదేపా నేతలతో ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రేవంత్‌ వ్యవహారంపై ప్రధానంగా చర్చించేందుకు విజయవాడకు రావాలని సీఎం నిన్న ఆ పార్టీ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10గంటలకే అక్కడకు చేరుకున్న నేతలు చంద్రబాబు రాక కోసం వేచిచూశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ఆలస్యం కావడంతో రేవంత్‌ సీఎం కార్యదర్శికి తన రాజీనామా లేఖ ఇచ్చి హైదరాబాద్‌కు వెనుదిరిగారు. తన ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆయన విమాన టిక్కెట్‌ బుక్‌ చేసుకొని దాని ప్రకారమే హైదరాబాద్‌కు పయనమైనట్టు తెలుస్తోంది.పార్టీ బలోపేతంపైనే చర్చ గత కొంతకాలంగా తెదేపాలో జరుగుతున్న పరిణామాలపైనే చంద్రబాబు తెలంగాణ నేతలతో చర్చించనున్నట్టు సమాచారం.రేవంత్‌ ఇటీవల రాహుల్‌ను కలిసిన తర్వాత నుంచీ ఆయన తెదేపాను వీడతారనే వూహాగానాలు విన్పించాయి. పార్టీ నేతలూ అలాగేభావిస్తూ వచ్చారు. దీంతో ప్రస్తుత సమావేశంలో తెలంగాణలో తెదేపాను ఎలా బలోపేతం చేయాలనే అంశంపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *