తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన ఖరారు

హైదరాబాద్ ముచ్చట్లు:

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 20వతేదీన వరంగల్‌లో జరిగే సభలో రాహూల్ పాల్గొననున్నారు. సాయంత్రం 6గంటలకు సభ జరగనుంది. ఈమేరకు ఢిల్లీలోని రాహూల్ గాంధీ కార్యాలయం ఆయన పర్యటన వివరాలను ఖరారు చేసి తెలంగాణ కార్యాలయానికి పంపింది. కాగా… ఈనెలలో తెలంగాణలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి ఆ సభకు రాహూల్‌ను రప్పించాలని టీ పీసీసీ గత నెలలోనే తలపెట్టింది. అంతేగాక ఇటీవల రేవంత్‌రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు పెద్దఎత్తున కాంగ్రెస్‌లో చేరారు. దీంతో టీ పీసీసీలో కొత్త ఉత్సాహం కనబడుతుండగా రాహూల్ సభ ద్వారా కార్యకర్తల్లో కొత్త జోష్‌ను నింపాలని టీ పీసీసీ సంకల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *