తెలంగాణ తాజావార్తలు గాంధీనగర్ పీఎస్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ ముచ్చట్లు:

నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో కలకలం రేగింది. ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమికులు ఇద్దరిని పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిపించారు. అయితే ఆ యువతిని పెళ్లి చేసుకునేదిలేదని యువకుడు పోలీసులు ఎదుట చెప్పాడు. దీంతో ఆ యువతి అక్కడున్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఎల్బీనగర్‌కు చెందిన వెన్నెల అనే యువతి, గాంధీనగర్‌కు చెందిన కిషోర్ అనే వ్యక్తిని ప్రేమించింది. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కిషోర్ ఆమెను ప్రేమిస్తున్నట్టుగా నటించి, పెళ్లికి నిరాకరించాడు. దీంతో వెన్నెల శుక్రవారం గాంధీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తూ..తనకు న్యాయం చేయాలని కోరింది. పోలీసులు కిషోర్‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో వెన్నెల బాత్‌రూంకు వెళ్లి ఫినాయిల్ తాగి అక్కడే పడిపోయింది. అది గమనించిన పోలీసులు హెుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు.ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అయితే ఫినాయిల్ ఎక్కువ మోతాదులో తాగిందని డాక్టర్లు చెప్పారు. కిషోర్ పోలీసులు అదుపులోనే ఉన్నాడు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *