తెలుగుదేశం గూటికి రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి

రంపచోడవరం వైకాపా ఎమ్మెల్యే రాజేశ్వరి తెలుగుదేశం గూటికి చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆమె తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. వైకాపా అధినేత జగన్ జనసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించడానికి ముందు ఆ పార్టీకి రాజేశ్వరి పార్టీ మార్పు ఒక షాక్ అనే చెప్పాలి. గత కొంత కాలంగా రంపచోడవరం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఆమె ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *