తెలుగు ముచ్చట్లు ఆహ్వానం

తెలుగు ముచ్చట్లు వెబ్‌ ఛానల్‌ ప్రారంభోత్సవ సందర్భంగా మాదనపల్లెలో వెలసిన శ్రీషిరిడిసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు దక్షిణామూర్తి, అరుణమ్మ , ప్రకాష్‌, శ్రీవాణి, క్రిష్ణమూర్తి, అన్నపూర్ణ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఛానల్‌ను మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ, లయన్‌ డాక్టర్‌ శివ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ రెండు ర్ఖా•ల తెలుగు ప్రజలతో పాటు ప్రేక్షకులకు తాజావార్తలు అందించేందుకు తెలుగుముచ్చట్లు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుముచ్చట్లు డైరెక్టర్లు అహమ్మద్‌బాషా, ఫిరోజ్‌ అహమ్మద్‌, అయూబ్‌ఖాన్‌, కెసిటివి అధినేత ముత్యాలు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌, మున్సిపల్‌ ఆర్‌ఐ నరేంద్రరాజుతో పాటు ప్రముఖ వ్యాపారులు ఆర్‌విటి.బాబు, యల్లంపల్లి అమరనాథ్‌, వైఎస్సాఆర్సీపి పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌, యువనాయకులు రాజేష్‌, సురేష్‌, కుమార్‌, జెపి యాదవ్‌, హేము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *