దళితవాడ వద్ద పశువుల కళేబరాలను వేయడం దారుణం.

పెద్దపంజాణి ముచ్చట్లు

దళితుల నివాసప్రాంతాల వద్ద చనిపోయిన పశువుల కళేబరాలను వేయడం దారుణమని భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యదర్శి జల్లి హరిక్రిష్ణ తెలిపారు. ఇలా ఎందుకు చేస్తున్నారని గ్రామ పెద్దలను అడిగితే.. తమ గ్రామంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారమని వారు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని గౌదమాకులపల్లె గ్రామంలో సోమవారం రమాదేవి అనే మహిళ కు చెందిన పాడి ఆవు ప్రసవ వేదనతో మృతి చెందింది. కాగా మృతి చెందిన ఆ పశువును గ్రామస్థులు దళిత వాడకు సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వద్దకు తీసుకెళ్ళి పడవేశారు. దీంతో స్కూలు పిల్లలకు,గ్రామస్థులకు ఇబ్బంది గా ఉందని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *