Kalvakuntla-Chandrasekhar-Rao-Telangana-today

దిగజారుతున్న తెలుగుతేజం

తెలుగుదేశ పార్టీ జాతీయ పార్టీగా మార్పుచెందిన తరువాత తెలంగాణలో ఆ పార్టీ దాదాపుగా కనుమరుగు కనుందా అన్న స్థారుకి దిగజారింది. గత తెలుగు రాష్ట్రాలు విభజననాంతరం కొత్తగా ఏర్పడిన ఆంద్రప్రదేశ్‌లో తిరుగులేని మెజారిటీని కైవసం చేసుకున్న టీడీపీ తెలంగాణలో మాత్రం అదే స్థారులో బలహీన పడుకుంటూ వస్తోంది. గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో ఘోర పరభావం మూటగట్టుకుందనే చెప్పాలి. అరుతే ఎన్నికలు ముగిసి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నా టీటీడీపీలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అంతేకాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీపై అంతగా దృష్టి పెట్టలేదన్న వార్తలు ఉన్నారు. అంతేకాకుండా పార్టీలోని నాయకులు సమన్వయ లోపం కూడా ఒక కారణమే.

ఇకపోతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌ను పూర్తిగా మరిచిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబునాయుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తీసుకున్న నిర్ణయాలు అక్కడి ప్రజల మనసులో గట్టిగా నాటుకు పోయారు. ఇక ఆ పార్టీలో ఉన్న తెలంగాణ తెలుగుదేశం నాయకులు కూడా జై తెలంగాణను మరిచి జై చంద్రబాబు అనడం, చంద్రబాబు చెప్పిన మాటలను గిరిదాటకుండా ఉడటం పార్టీపై తీవ్ర ప్రభావం చూపాయని పలువురు రాజకీయ మేదావులు విశ్వసిస్తున్నారు. ఇకపోతే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుని తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ప్రగల్భాలతో ప్రజలను మాయ చేయడానికి నానా పాట్లు పడుతూ ఉండవచ్చు. కానీ క్షేత్రస్థారులో ఆ పార్టీ పరిస్థితి ఎంత నీచంగా ఉన్నదో ఒక్కొక్క తార్కారం వెలుగు చూస్తోంది. ఆ పార్టీకి ఉన్న బలానికి భారతీయ జనతా పార్టీ బలాన్ని కూడా కులుపుకుని వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంత ఘోరంగా మూడోస్థానానికి పడిపోరుందో డిపాజిట్‌ కూడా దక్కకుండా పరువు పోగొట్టుకున్నదో అందరికి తెలిసిందే.

ఇక 2019 సార్వత్రిక ఎన్నికల విషయాన్ని పక్కన పెడితే తాజాగా రానున్న స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండనుందో గమనిస్తే ఇక అంతే పార్టీకి దాదాపుగా అధికారానికి చాలా దూరంలోనే ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నారు. ఇందులో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కనీసం ఆ ఎన్నికల్లో సుమారు పది స్థానాలకు పోటీచేసే యోగత్య కూడా లేని స్థితిలో ఉంది. అంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత నీచమైన స్థితిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే తెలంగాణలో స్థానిక సంస్థలు కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చేసిన విషయం విధితమే. డిసెంబర్‌ 27న ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగనున్నారు. ఇందుకు గానూ డిసెంబర్‌ 2వ తేదీన నోటిఫికేషన్‌ వస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ విడుదల అరునప్పటి నుంచి తెలంగాణ రాజకీయ వర్గాలు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి. అభ్యర్ధులు కసరత్తులు నడుస్తున్నారు. అరుతే మెజారిటీ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ మాత్రమే పోటీ జరిగే వాతావరణం కనిపిస్తోంది.

అసలు తెలుగు దేశం ఊసు కూడా వినిపించడం లేదు. కాకపోతే ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగుతారనే అవకాశం మాత్రం ఉంది. ఎందుకనగా చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్న స్థానిక సంస్థల బలం చాలా ఘోరమే. ప్రస్తుతం కరీంనగర్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండేసీ స్థానాలకు, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, మెదక్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్క స్థానానికి పోటీ జరగబోతోంది. ఈ మొత్తం 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయగల సీన్‌ ఉన్నది కేవలం రెండంటే రెండుస్థానాల్లో మాత్రమే. ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం గ్రేటర్‌ హైదరాబాద్‌తోనే కాకుండా కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నారు. వీటిలో టీఆర్‌ఎస్‌ పార్టీతో గట్టి పోటి ఇవ్వగల పార్టీ అంటే కేవలం కాంగ్రెస్‌ నని చెప్పాలి. అంతేకాకుండా నారాయణ్‌ ఖేడ్‌, అవసరమైతే సనత్‌ నగర్‌కు కూడా ఎన్నికలు జరిపేందుకు టీ సర్కార్‌ పావులు కదుపుతోంది. అరుతే ఈ క్రమంలో టీడీపీకి మాత్రం ఈ ఎన్నికల్లో సైతం ఘోర పరాజయం పాలు కాకతప్పదన్న సంకేతాలు ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంచి పట్టే ఉంది. అప్పట్లో గ్రేటర్‌ సీటును కైవసం చేసుకుని హైదరాబాద్‌ పాలన కొనసాగించింది. కానీ ప్రస్తుతం వరంగల్‌ ఘోర ఓటమి ప్రభావం గ్రేటర్‌ పడే అవకాశం ఉండక తప్పదు. అంతేకాకుండా గ్రేటర్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపుగా గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇకపోతే ఈ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో టీడీపీ మనుగడ కష్టమే అని చెప్పక తప్పదు. ఇది ఇలా ఉంటే ఆ పార్టీ నేత, తెలంగాణలో ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌ రెడ్డి సైతం పార్టీ మారొచ్చన అనుమానాలు కూడా ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌ రావొచ్చన్న వార్తలు గుప్పుమంటున్నారు. రేవంత్‌ రెడ్డి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి ఏ నాయకుడు చేయని త్యాగం చేశారు. అరునా ఆయనకు ఆ పార్టీ సముచ్చిత స్థానం దక్కడంలేదని, పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులు సైతం ఆయనకు పెద్దగా గుర్తించడంలేదని ఇక పార్టీలో ఉంటే తన అభివృద్ది జరగకపోవచ్చన్న అనుమానంతో రేవంత్‌ ఉన్నారని సమాచారం.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ హై కమండ్‌తో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు జానా రెడ్డి, జైపాల్‌ రెడ్డిలు పార్టీ నాయకురాలు సోనియాగాంధీతో రేవంత్‌ ఆహ్వానం గురించి ప్రస్తావించినట్టు బొగాట్ట! అంటే ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా కనుమరుగయ్యే ప్రమాద ఘట్టికలు మోగుతున్నాయని తెలుస్తోంది. అరుతే ఈ వ్యవహారంపై ఆ పార్టీ నాయకులు జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ మనుగడకు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి మరి.

Tags: tdp party,cm babu,amaravathi,congres party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *