చిత్తూరు ముచ్చట్లు
చిత్తూరు జిల్లాలో అటవీశాఖ, దేవాదాయశాఖ భూములు వందలాది ఎకరాలు కబ్జా అవుతున్నాయి. కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ భూమి రికార్డుల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు రియల్ఎస్టేట్ వ్యాపారుల కబంధహస్తలలోనికి చేరుతోంది. తిరుపతి, తిరుచానూరు, రామచంద్రాపురం, చౌడేపల్లె, పుంగనూరు, పెద్దపంజాణి, రామసముద్రం, సోమల, బంగారుపాళ్యెం మండలాల్లో భూకబ్జాలకు అడ్డు, అదుపు లేకుండ పోతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.