దేశంలోనే తొలి ఆయుర్వేద ఇనిస్టిట్యూట్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.

ఢిల్లీముచ్చట్లు

ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద(ఏఐఐఏ)ను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ప్రారంభించి జాతికి అంకితం చేశారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఒక ఆయుర్వేద ఆసుపత్రి ఉండాలన్నారు. ఇందుకోసం ఆయుష్‌ మంత్రిత్వశాఖ కృషి చేస్తుందన్నారు. ‘ఒక దేశం ఏ రకంగానైనా అభివృద్ధి చెందగలదు. కానీ ఆ దేశ చరిత్ర, వారసత్వ సంపదను గర్వించే స్థాయికి తీసుకెళ్లేంత వరకు ఏ దేశమూ ముందుకు సాగలేదు.’ అని మోదీ అన్నారు.ఈ ఇనిస్టిట్యూట్‌ను ఆయుష్‌ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారు. 10 ఎకరాల్లో రూ.157కోట్లతో నిర్మించారు. సంప్రదాయ ఆయుర్వేద జ్ఞానంతో ఆధునిక సాంకేతిక విశ్లేషణను సమన్వయ పరుస్తూ వైద్యం అందించేందుకే ఈ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఇనిస్టిట్యూట్‌లో న్యూరాలజీ, డీజనరేటివ్‌ డిసీస్‌ కేర్‌ యూనిట్‌, యోగా, పంచకర్మ క్లినిక్‌, క్రియకల్ప తదితర విభాగాలున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *