నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

విజయవాడ ముచ్చట్లు:

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న రమాదేవి కాలేజీ భవనంపై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే విద్యార్ధిని చేయి విరగడంతో పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. చికిత్స అందిస్తుండగానే రమాదేవి ఈరోజు మధ్యాహ్నం (శనివారం) మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతురాలు రమాదేవి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస. ఆమె మరణవార్తను తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఇది రెండో సంఘటన.కాగా బుధవారం రాత్రి సాగిరెడ్డి పూర్ణ లక్ష్మీనరసింహమూర్తి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *