నేడు కేదార్‌నాథ్‌కు ప్రధాని మోదీ

దిల్లీ ముచ్చట్లు:

ప్రధాని మోదీ ఈ రోజు కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించనున్నారు. చలికాలంలో అక్కడకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా శనివారం నుంచి ఆరునెలల వరకు కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మూసి ఉంచుతారు. కేదార్‌నాథ్‌ పర్యటనకు వెళ్తున్న ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేయనున్నారు. 2013లో సంభవించిన జలప్రళయంలో దెబ్బతిన్న ఆదిశంకరాచార్య సమాధి పునర్నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారని భాజపా వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ ఈ ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జలీగ్రాంట్‌ విమానాశ్రయానికి చేరుకుని కేదార్‌నాథ్‌కు పయనమవుతారు.ఈ సీజన్‌లో ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. మే 3న కేదార్‌నాథ్‌ ఆలయం పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని ఉత్తరాఖండ్‌ విమానాశ్రయం, కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *