నేపాల్‌లో ఘోర ప్రమాదం..31 మంది మృతి

ఖాట్మండు  ముచ్చట్లు:

నేపాల్‌లో ఘోరమైన బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఖాట్మండ్ వద్ద వస్తున్న బస్సు పృథ్వీ జాతీయ రహదారిపై ఒక మలుపు తిరుగుతున్న సమయంలో అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది మృతి చెందగా…మరో 16 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంబంధిత అధికారులు ఘటనాస్ధలికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సును వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *