The Chief Minister's worst shock of death is fun with official promotions

నేరెళ్ల మృతిపట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిఅధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Date:19/06/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ధ్వని అనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ మృతి మిమిక్రీ కళారంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన మిమిక్రీ కళకు పితామహుడిగా పేరొందారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన వ్యక్తి నేరెళ్ల అని కొనియాడారు. మిమిక్రీ కళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా నేరెళ్ల మలిచారు అని సీఎం పేర్కొన్నారు. నేరెళ్ల వేణుమాధవ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్‌కే జోషికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.  తెలంగాణ శాసన మండలి  చేర్మెన్  ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వేణుమాధవ్ మిమిక్రీ కళాకారుడిగా, థియేటర్ ఆర్టిస్టు గా అనేక ప్రశంసలు, అవార్డ్ లు అందుకొన్నారని  కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీఅవార్డ్ తో కూడ సత్కరించినదని అన్నారు. అంతేగాక థియేటర్ ఆర్టిస్టు గా ఎన్నో నాటకాలు వేసి ప్రజల మన్ననలను అందుకొన్నారని, ఉపాధ్యాయుడిగాపని చేయడమే గాక పలు ప్రభుత్వ పదవులు,  ఎంఎల్సీ గా 1972-78 లో పనిచేసి ప్రజలకు సేవలందించారన్నారు. ఆయన ఆత్మకు భగవంతు డు శాంతి చేకూర్చాలని వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Tags:The Chief Minister’s worst shock of death is fun with official promotions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *