న్యాయస్థానాల్లో తెలుగుబాషను అమలుపరచాలి – న్యాయవాది ప్రకాష్‌ వినతి.

తిరుపతి ముచ్చట్లు

రెండు తెలుగుర్ఖా•ల ముఖ్యమంత్రులు నారాచంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు తెలుగుబాషను న్యాయస్థానాల్లో ఖచ్చితంగా అమలుజరిగేలా కృషి చేయాలని చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన న్యాయవాది పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌ కోరారు. పొరుగురాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులో వారి మాతృబాషను అన్ని కార్యాలయాలలోను అమలు పరుస్తున్నారని తెలిపారు. ఇదే విధంగా తెలుగుర్ఖా•లలో తెలుగుబాషను అమలుచేసి, మాతృబాషను మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరారు. కాగా రెండు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా న్యాయస్థానాలలో తెలుగుబాషలో దావాలు దాఖలు చేసి, న్యాయవాది పి.ఎన్‌,ఎస్‌.ప్రకాష్‌ రికార్డు సృష్టించారు. అన్ని న్యాయస్థానాలలోను తెలుగుబాషలోదావాలు దాఖలు చేస్తూ, మాతృబాషపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. న్యాయవాది ప్రకాష్‌ 2012 నుంచి న్యాయస్థానాలలో అమలుపరుస్తూ , నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు వివిధ రకాలకు చెందిన సుమారు 200 దావాలను తెలుగుబాషలో దాఖలు చేశారు. దీనిని గుర్తించిన తెలుగుబుక్‌ఆఫ్‌ రికార్డస్ అధ్యక్షుడు డాక్టర్‌ చింతపట్ల వెంకటాచారి ప్రశంసిస్తూ 2015 సంవత్సరంలో అవార్డును పంపారు. అలాగే ఆంధప్రదేశ్‌ బుక్‌ ఆఫ్‌ స్టేట్‌రికార్డ్సులో చీఫ్‌ఎడిటర్‌ నటరాజ గుర్తించి 2016 లో అవార్డు, ప్రశంసపత్రాన్ని అందజేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ది హిందూ దినపత్రికతో పాటు దినపత్రికలు ఈ ప్రత్యేక కథనాలను ప్రచురించారు. మాతృబాషను అమలుపరిచేందుకు ప్రతి ఒక్కరు తమ వాద, ప్రతివాదనలు, విచారణలు తెలుగులో జరిపేలా కృషి చేయాలని న్యాయవాదుల సంఘాలను ఆయన కోరుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *