న్యూయార్క్ లో మరో ఉగ్రదాడి..

ట్రక్కుతో బీభత్సం సృష్టించిన దుండగుడు.. ఎనిమిది మంది మృతి!

అమెరికాలోని న్యూయార్క్‌లో డబ్ల్యూటీసీ వద్ద ఓ దుండగుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. లోయర్‌ మాన్‌హట్టన్‌ ప్రాంతంలో 29 ఏళ్ల ముష్కరుడు ట్రక్కును నడుపుతూ ఒక్కసారిగా సైకిళ్లు వెళ్లే మార్గంలోకి మళ్లించాడు. వేగంగా జనంపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న భధ్రతాసిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అనుమానితున్ని సేఫుల్లో సైపోవ్‌గా గుర్తించారు. ఇతను 2010లో అమెరికాకు వలస వచ్చాడు. ప్రస్తుతం ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. ట్రక్కులో ఐసిస్‌కు సంబంధించి ఓ లేఖను గుర్తించారు. ఈ ఘటన ఉగ్రదాడేనని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డి బ్లసియో తెలిపారు. ఈ ఘటనపై భద్రతాసిబ్బంది విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. న్యూయార్క్‌ ఉగ్రదాడిలో మృతుల కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవుడు, ఈ దేశం మీ వెంటే ఉందని ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *