పథకాలను ఇంటింటికి చేరవేయాలి. – మంత్రి అమరనాథ్ రెడ్డి

పలమనేరు ముచ్చట్లు

తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం పెద్ద పంజాణి మండలంలో మంత్రి స్వగ్రామమైన కెళవాతి లోని తమ ఇంట్లో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ని బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులను గుర్తించి వారికి లబ్ది చేకూర్చాలని సూచించారు.గ్రామాలలో మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో టిడీపీ జిల్లా కోశాధికారి ఆర్వీ బాలాజీ,మున్సిపల్ వైస్ చైర్మన్ చాంద్ భాషా, ఏఎంసి మాజీ చైర్మన్ రాంచంద్ర నాయుడు, నాయకులు సుధీర్ కుమార్, హేమంత్ కుమార్ రెడ్డి,బాలాజీ నాయుడు, బ్రహ్మయ్య,కదిరప్ప, చౌడప్ప, రంగనాథ్, ప్రసాద్ నాయుడు, శ్రీరాములు, వెంకట్రమణా రెడ్డి, మురహరి,మల్లీశ్వర్ రెడ్డి, రామక్రిష్ణ,భానుప్రకాష్ , వెంకటరత్నం, ప్రజాప్రతినిధులు గీత, మురళి, శమంతక మణి, మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *