‘పద్మావతి’ భర్తను చూశారా?

బాలీవుడ్‌ నటులు దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రానికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘రాణి పద్మావతి’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనికి కొనసాగింపుగా పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రను నేడు పరిచయం చేశారు.
ఈ పాత్రలో షాహిద్‌ నటిస్తున్నాడు. ఒంటి నిండా గాయాలతో ఉన్నా ధైర్యం నిండిన కళ్లతో ‘రతన్‌ సింగ్‌’ ఆహార్యం ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ ఫస్ట్‌లుక్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌ టాప్‌లో ఉంది. ఇందులో అల్లా ఉద్దిన్‌ ఖిల్జి పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఇక ఖిల్జి పాత్రలో రణ్‌వీర్‌ ఎలా ఉండబోతున్నాడోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *