పన్ను నిరాకరణ ‘సత్యాగ్రహం’లో ప్రకాష్‌రాజ్

బెంగళూరు:

హస్త కళల ఉత్పత్తులను వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి మినహాయించాలని కోరుతూ రంగస్థల దిగ్గజం ప్రసన్న చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు. బుధవారంనాడు నిరాహార దీక్ష శిబిరంలో ప్రకాష్‌రాజ్ పాల్గొని తన సంఘీభావం తెలియజేశారు. ప్రసన్న చేపట్టిన ‘పన్ను నిరాకరణ సత్యాగ్రహం’ ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, ‘ఇదే ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’, ఉద్యోగాల కల్పన వాగ్దానాలు చేసింది. హస్త కళల ఉత్పత్పులకు పన్ను విధించరాదని కోరడం సామాజిక న్యాయంలో భాగం’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *