పరకాలలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్

Date:13/04/2018
వరంగల్ అర్బన్
వరంగల్ జిల్లా పరకాలలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని భూపాలపల్లి రోడ్డులో ఈ వ్యవస్థను ప్రారంభించారు. దీంతో స్థానికంగా రాత్రిపూట లైట్లు విఫలమయ్యే అవకాశాలు తగ్గిపోనున్నాయి. రహదారులపై రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుంటుంది. ఇదిలాఉంటే గూడెప్పాడ్‌ నుంచి పరకాల మీదుగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా పరకాలలోని హన్మకొండ రహదారి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు, అక్కడి నుంచి భూపాలపల్లి రోడ్డులోని పెట్రోల్‌ బంకు వరకు డివైడర్లు ఏర్పాటుచేశారు. ఈ విభాగినుల మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థకు సంబంధించిన స్తంభాలను ఏర్పాటుచేయాలి. కానీ ఈ పనులు ఆలస్యమయ్యాయి. దీంతో కార్పోరేషన్ అధికారులు రోడ్డుకు ఇరువైపులా ట్యూబ్‌లైట్లనే ఏర్పాటు చేశారు.
సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన స్తంభాల ఏర్పాటులో జాప్యం ఉండడంతో కార్పోరేషన్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి రోడ్డులోని పెట్రోల్‌ బంకు నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వైపు ట్యూబ్‌లైట్ల ఏర్పాటు నిమిత్తం స్తంభాలను బిగిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయని చెప్తున్నారు. ఇక స్తంభాల ఏర్పాటు పూర్తైన వెంటనే లైట్లను బిగించే కార్యక్రమం సైతం జరిగిపోతుంది. మొత్తంగా 7 రోజుల్లో లైట్లు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్‌స్టేషన్‌ వరకు, బస్‌స్టేషన్‌ నుంచి వెల్లంపల్లి రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయగా దీపాలు బిగించారు. హన్మకొండ, భూపాలపల్లి రోడ్డులోనూ ఆ లైట్లు పని చేస్తే పట్టణమంతటా సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం పనిచేస్తుందని చెప్తున్నారు.
Tags:Central lighting system in parasites

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *